మాజీ సీఎం కమల్ నాథ్‌కు ఈసీ షాక్..

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ కు ఎన్నికల సంఘం(ఈసీ) షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న స్టార్ క్యాంపెయినర్ హోదాను ఈసీ తొలగించింది. ఈ మేరకు శుక్రవారం ఈసీ ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై కమల్‌ నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఆ వ్యయాన్ని ఆ నియోజక వర్గం అభ్యర్థి భరించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. కాగా ఇటీవల దాబ్రాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని […]

Update: 2020-10-30 08:42 GMT

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ కు ఎన్నికల సంఘం(ఈసీ) షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న స్టార్ క్యాంపెయినర్ హోదాను ఈసీ తొలగించింది. ఈ మేరకు శుక్రవారం ఈసీ ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై కమల్‌ నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఆ వ్యయాన్ని ఆ నియోజక వర్గం అభ్యర్థి భరించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది.

కాగా ఇటీవల దాబ్రాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని ఇమర్తి దేవిని ఐటమ్ గా ఆయన అభివర్ణించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం లేచింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ లేఖ రాశారు. ఇక కమల్ నాథ్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆ నేపథ్యంలో కమల్ నాథ్ ను ఈసీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News