జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి

దిశ, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలంగాణ రాష్ర్ట మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగపర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అకాడమీ సిబ్బంది సైతం ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. బదిలీపై వెళ్తున్న జాయింట్ డైరెక్టర్ ఎండీ […]

Update: 2021-09-06 09:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలంగాణ రాష్ర్ట మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగపర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అకాడమీ సిబ్బంది సైతం ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. బదిలీపై వెళ్తున్న జాయింట్ డైరెక్టర్ ఎండీ ముర్తుజాను సన్మానించి వీడ్కోలు పలికారు.

టీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి అస్కాని మారుతి సాగర్, యూనియన్ నాయకులు ఇస్మాయిల్, బి.శ్రీనివాస్ కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ ఎం.పూర్ణచంద్రరావు, మేనేజర్ ఎ వనజ, ప్రసాద్, రాజ్ కుమార్, నర్సింహరావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News