Trending: ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తి.. పోలీసులకు అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

హిందువులు ఆలయాలకు, ముస్లింలు మసీదులకు, క్రైస్తవులు చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయడం సహజం.

Update: 2024-11-19 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు ఆలయాలకు, ముస్లింలు మసీదులకు, క్రైస్తవులు చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయడం సహజం. కానీ, ఆలయంలో ఓ వ్యక్తి నమాజ్ చేసిన ఘటన నాగోల్‌ (Nagole)లోని ధనలక్ష్మి నగర్ (Dhanalakshmi Nagar) చండీ అమ్మవారి ఆలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చండీ చంద్రమౌళీశ్వర ఆలయంలో అయ్యప్ప భక్తులు సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఓ ముస్లిం యువకుడు ఆలయంలోకి వెళ్లి నమాజ్ చేశాడు. దీంతో అక్కడే ఉన్న అయ్యప్ప భక్తులు తీవ్ర అభ్యంతరం చేశారు. అయితే, ఓ స్వామి వెంట వచ్చిన సదరు ముస్లిం యువకుడు, మాల వేసుకున్న వ్యక్తి కూడా వేరే మతానికి చెందిన వారిగా అక్కడున్న వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tags:    

Similar News