సముద్రంలో ఘోస్ట్ నెట్స్.. ప్రాణాలకు తెగించిన స్కూబా డ్రైవర్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సముద్ర జీవులను ఘోస్ట్ నెట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వలలు తెగిపోయి అంతర్భాగానికి చేరుతున్నాయి. ఈ క్రమంలో సముద్రంలోని చేపలు, తాబేళ్లు, పీతలు, ఇతర జీవాలు ఈ వలకు బలవుతున్నాయి. వలల్లో చిక్కుకుని ఈదలేక ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏడాదికి ఒక్కో సముద్రంలో 5 లక్షల నుంచి 1 మిలియన్ వరకు చేపలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కొన్ని సార్లు స్కూబా డైవింగ్‌కు వెళ్లిన వారిని కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సముద్ర జీవులను ఘోస్ట్ నెట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వలలు తెగిపోయి అంతర్భాగానికి చేరుతున్నాయి. ఈ క్రమంలో సముద్రంలోని చేపలు, తాబేళ్లు, పీతలు, ఇతర జీవాలు ఈ వలకు బలవుతున్నాయి. వలల్లో చిక్కుకుని ఈదలేక ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఏడాదికి ఒక్కో సముద్రంలో 5 లక్షల నుంచి 1 మిలియన్ వరకు చేపలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కొన్ని సార్లు స్కూబా డైవింగ్‌కు వెళ్లిన వారిని కూడా ఘోస్ట్ నెట్స్ వణికిస్తున్నాయి. ఇవి సముద్ర అంతర్భాగంలో ఏళ్ల తరబడి నాశనం కాకుండా ఉండడంతో సముద్ర పర్యావరణం కాలుష్యం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్కూబా డ్రైవర్ల సాహసం..
టర్కీలోని ఇజ్మీర్‌లోని కరాబురున్ జిల్లాలో ఇద్దరు స్కూబా డ్రైవర్లు పెను సాహసం చేశారు. సముద్ర పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నంలో నవంబర్ 6వ తేదీన సముద్ర అంతర్భాగంలోని పేరుకుపోయిన 200 మీటర్ల ఘోస్ట్ నెట్‌ను క్లియర్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఘోస్ట్ నెట్ క్లియరింగ్ కోసం స్వచ్ఛంద సేవకులు ముందుకు వస్తున్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇందుకు చర్యలు తీసుకుంటున్నా.. పూర్తి స్థాయిలో తొలగించలేకపోతున్నారు. ఈ సమస్యను క్షేత్ర స్థాయిలో తీసుకుని.. చేపలు, సముద్రపు జీవాల మృత్యువాతను అరికట్టాలంటూ హితవు పలికారు.