AP News:వ్యవసాయ రైతులకు శిక్షణ కార్యక్రమం

కారంపూడి మండలం పరిధిలోని చిన్న కొదమ గుండ్ల గ్రామంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు శిక్షణ నిర్వహించారు.

Update: 2024-11-27 09:55 GMT

దిశ,కారంపూడి: కారంపూడి మండలం పరిధిలోని చిన్న కొదమ గుండ్ల గ్రామంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు శిక్షణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోతుందని అని రైతులు సస్యరక్షణ కార్యక్రమాలు మరియు ఎరువులు మోతాదుకు మించి వాడటం వలన భూమి సారం తగ్గుతుంది అని అన్నారు. ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. వ్యవసాయ అధికారులు సూచించిన ఎరువులు, పురుగు మందులు వాడాలని తెలిపారు.

జీవన ఎరువులు మరియు పచ్చిరొట్ట ఎరువులు వాడటం వలన 10-20%నజని భూమికి లభిస్తుంది అన్నారు. ఇప్పటికైనా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. అలాగే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు.అనంతరం ఒప్పిచర్ల మరియు మిర్యాల వరి కోత కోసే పొలాలను సందర్శించారు. రైతు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది అని అన్నారు. క్వింటా వరిగ్రేడ్-A రేగం = 1725/-, వరి సాధారణ రేగం- = 1700 /- per కిసంటా అని రైతులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యలమంద మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News