Minister Nadendla Manohar:రైతు పండించే ప్రతి గింజ కొంటాం

రైతులు పండించే ప్రతి గింజ కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) స్పష్టం చేశారు.

Update: 2024-11-27 13:02 GMT

దిశ,వెబ్‌డెస్క్: రైతులు పండించే ప్రతి గింజ కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) స్పష్టం చేశారు. తుఫాన్ పేరుతో తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారుల పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లోని రైతులను ఆయన పలకరించారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. తొందరపడి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవత్సరంతో పోల్చితే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరంలో నాలుగు లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం పూర్తయిందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ధాన్యం కొనుగోలు అవ్వగానే 24 గంటల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసే సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News