ప్రధాని మోడీతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అనంతరం కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

Update: 2024-11-27 09:56 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన.. ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi)తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రధాని మోడీతో భేటీ అనంతరం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ.. తన విలువైన సమయాన్ని ఏపీ ప్రజల కోసం కేటాయించారని.. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీతో మిటింగ్ పై సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఇలా రాసుకొచ్చారు.

"ఈ రోజు నేను భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం.. విశిష్టమైన గౌరవాన్ని కలిగి ఉంది. మా చర్చలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కీలక సవాళ్లను పరిష్కరించడం, రాష్ట్ర పురోగతికి వ్యూహాత్మక పరిష్కారాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. ప్రధాని మోడీ నాయకత్వం భారతదేశాన్ని అపూర్వమైన అభివృద్ధి వైపు నడిపిస్తూనే ఉంది. దేశవ్యాప్త అభివృద్ధిని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సాధికారత కల్పించడంపై ఆయన నొక్కి చెప్పడం చాలా కీలకం. మన రాష్ట్రం, దేశ పురోభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలకు సహకరించాలని నేను ఎదురుచూస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.


Similar News