కరోనా నివారణలో ఏ మాస్క్ మంచిదో తెలుసా..?
దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ భారీ నుంచి తప్పించుకోవడానికి మాస్క్ తప్పని సరికావడంతో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఏదో ఒక మాస్క్‌ను వాడుతున్నారు. వైరస్ ను దరిచేకుండా చేసేందుకు మార్కెట్ లో లభించిన మాస్క్‌లను అవగాహనల లేకుండా వినియోగిస్తున్నారు. అందరూ ఒకే రకమైన మాస్క్‌లను వినియోగించడం వలన సమస్యలు తప్పవని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. అవగాహన లేకుండా మాస్క్‌లను వాడటం ఆరోగ్యానికి మంచిదికాదని సూచిస్తోంది. పనిచేసే ప్రదేశాలు, వయసు, ఆరోగ్య పరిస్ధితులను బట్టి మాస్క్‌లను వినియోగించాలని తెలుపుతున్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ భారీ నుంచి తప్పించుకోవడానికి మాస్క్ తప్పని సరికావడంతో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఏదో ఒక మాస్క్‌ను వాడుతున్నారు. వైరస్ ను దరిచేకుండా చేసేందుకు మార్కెట్ లో లభించిన మాస్క్‌లను అవగాహనల లేకుండా వినియోగిస్తున్నారు. అందరూ ఒకే రకమైన మాస్క్‌లను వినియోగించడం వలన సమస్యలు తప్పవని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. అవగాహన లేకుండా మాస్క్‌లను వాడటం ఆరోగ్యానికి మంచిదికాదని సూచిస్తోంది. పనిచేసే ప్రదేశాలు, వయసు, ఆరోగ్య పరిస్ధితులను బట్టి మాస్క్‌లను వినియోగించాలని తెలుపుతున్నారు. మార్కెట్‌లో ఎన్ 99, ఎన్ 95 మాస్క్ , డబ్ల్యూ 95, ఎఫ్ఎఫ్‌పీ 1, సర్జికల్, యాక్టివేటెడ్, కార్బన్ , క్లాత్ వంటి 8 రకాల మాస్క్‌లను ప్రజలు వినియోగిస్తున్నారని తెలిపారు.
వీటిలో ఏ ఏ మాస్క్ ఎంత మేర రక్షణలు కల్సిస్తుందని వివరాలు వెల్లడించారు. ఎన్ 95, సర్జికల్, ఎఫ్ఎఫ్‌పీ 1, ఎన్ 99, డబ్ల్యూ 95, వంటి మాస్క్ లను ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది, కోవిడ్ పాజిటీవ్ వచ్చిన పేషెంట్లు, 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు, సోషల్ డిస్టెన్స్ పాటించడం వీలుకాని ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారు ధరించాలని సూచిస్తున్నారు. యాక్టివేటెడ్ కార్బన్, క్లాత్ మాస్క్, స్పాంజ్ మాస్క్‌లను కోవిడ్ లక్షణాలు లేని వారు, వృత్తి రీత్యా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, కార్యాలయాల్లో పనిచేసే వారు ధరించాలి సూచించారు.
డబుల్ మాస్క్ధరించడం వల్ల 85.4% కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని యునైటెడ్ స్టేట్స్ సెంంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్స్న (సీడీసీ) అధ్యయనం ప్రకటించింది . అయితే డబుల్ మాస్క్ ధరించిన వారిలో శ్వాసకోస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని జాగ్రత్తలు పాటించిన వినియోగించాలని సూచించారు. రెండు మాస్క్‌లను ఒకేసారి ధరించే ఈ పద్ధతిలో ఒకే రకమైన మాస్క్‌లను ధరించకూడదని . ముందుగా సర్జికల్ మాస్క్ వేసుకుని, దానిపై నుంచి క్లాత్ మాస్క్ ధరించాలని సూచించారు.
మాస్క్‌ల రకాలు వాటి నివారణ సామర్థ్యాలు
మాస్క్‌లు | వైరస్ | బాక్టీరియా | కాలుష్యం | దుమ్ము |
ఎన్ 99 | 99 | 100 | 100 | 100 |
ఎన్ 95 మాస్క్ | 95 | 100 | 100 | 100 |
డబ్ల్యూ 95 | 95 | 95 | 95 | 95 |
ఎఫ్ఎఫ్‌పీ 1 | 95 | 80 | 80 | 80 |
సర్జికల్ | 95 | 80 | 80 | 80 |
యాక్టివేటెడ్ కార్బన్ | 1 0 | 50 | 50 | 80 |
క్లాత్ | 0 | 50 | 50 | 50 |