ఆ ఆనందానికి బ్రేక్

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ సందర్భంగా ఆ ఆనందానికి బ్రేక్ పడింది. ఏంటా ఆనందం..ఎవరది ఆ ఆనందం అనుకుంటున్నారా.. థర్డ్ జెండర్లది. శ్రీరామ నవమికి, వీరికి సంబంధమేమిటనే వివరాల్లెకెళితే.. హరిహర క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. అతి పెద్ద శైవ క్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ ఏటా శ్రీ రామ నవమి […]

Update: 2020-04-01 23:47 GMT

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ సందర్భంగా ఆ ఆనందానికి బ్రేక్ పడింది. ఏంటా ఆనందం..ఎవరది ఆ ఆనందం అనుకుంటున్నారా.. థర్డ్ జెండర్లది. శ్రీరామ నవమికి, వీరికి సంబంధమేమిటనే వివరాల్లెకెళితే..

హరిహర క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. అతి పెద్ద శైవ క్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి క్షేత్ర పాలకుడు అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ ఏటా శ్రీ రామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. శివరాత్రిని తలదన్నేలా నిర్వహిస్తారని భక్తులు అంటుంటారు. నవమి రోజున సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కనుల విందుగా జరుగుతుంది. భద్రాద్రి రాములోరి ఆలయానికి వచ్చే భక్తులతో సమానంగా ఇక్కడకు భక్తులు వస్తారు. అయితే, ఈ కళ్యాణానికి సాధారణ భక్తులే కాదు థర్డ్ జెండర్స్ కూడా వేల సంఖ్యలో వస్తారు. ఇది విశేషం ఇక్కడ. ఒక రోజు ముందే వేములవాడకు చేరుకుని మరునాడు రాజన్నకు మొక్కులు తీర్చుకుంటారు వారు.

ఆ తర్వాత జరిగే రాముని కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ సీతా రాముల పెళ్లి తంతు ఎలా జరుగుతుందో అలాగే వీరూ నిర్వహించుకుంటారు. హిజ్రాలంతా వేదికవద్దకు చేరుకోగానే తలంబ్రాలు పోసుకోవడం, తాళి కట్టుకోవడం చేస్తుంటారు. సీతారాముల పెళ్లి నిర్వహిస్తున్న వేద పండితుల మంత్రోచ్ఛరణలకు అనుగుణంగా హిజ్రాలు నడుచుకుంటారు. రాజన్న ఆలయంలో శ్రీ రామనవమి రోజున వీరి కోసం దేవాదాయ అధికారులు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తారంటే వీరు ఎంత పెద్ద సంఖ్యలో రాజన్న ఆలయానికి చేరుకుంటారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే కాకుండా దేశం నలుమూలల నుంచి హిజ్రాలు పెద్ద సంఖ్యలు ఇక్కడకు చేరుకుని లగ్గం చేసుకుంటారు. ఆనందంగా లగ్గం అనంతరం పూజలు నిర్వహిస్తారు. అయితే, లాక్ డౌన్ వల్ల ఇప్పడు వారి ఆ ఆనందానికి బ్రేక్ పడింది.

కరోనా ఈ సారి రాములోరి పెళ్లిని తిలకించకుండా చేసిందని భక్తులు బాధపడుతున్నారు. అయితే, దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతూ..ఏటా తమ జీవితంలో నిర్వహించుకునే లగ్గం తంతు ఈ సారి నిర్వహించుకోలేక పోతున్నామని హిజ్రాలూ వాపోతున్నారు. కరోనా కట్టడికి సామాజిక దూరం పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణం వైభవంగా జరిగితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి గుంపులు గుంపులుగా గుమిగూడుతారని ఇలా చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఈ సారి భక్తులు, హిజ్రలు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.

Tags: seetha srima marriage, third genders celebrations, due to covid 19, lock down

Tags:    

Similar News