కరోనా తీవ్రత: ఆ రాష్ట్రంలో విద్యాసంస్థలు బంద్
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 15 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తెలంగాణతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేశాయి. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. థియేటర్లు, మాల్స్ బంద్ చేశాయి. పలు రాష్ట్రాలు […]
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 15 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తెలంగాణతో పాటు ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేశాయి. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. థియేటర్లు, మాల్స్ బంద్ చేశాయి. పలు రాష్ట్రాలు సెకండ్ లాక్‌డౌన్ విధించేందుకు కసరత్తు చేస్తున్నాయి.