ఓయూలో రేపటి నుంచి దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులు ప్రకటించారు.

Update: 2024-10-04 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులు ప్రకటించారు. వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు రేపటి నుంచి ఈ నెల 15 వరకు (మొత్తం 10 డేస్) దసరా సెలవులను ప్రకటించారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పాలన భవనంతో పాటు ఇతర కార్యాలయాల్లో యథావిధిగా విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని బోధనేతర ఉద్యోగులు విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. కాగా తెలంగాణలోని స్కూళ్లకు అక్టోబర్ 2 నుంచే హాలిడేస్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.


Similar News