30 నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నిర్వహించే ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ను అధికారులు రిలీజ్ చేశారు.

Update: 2024-09-27 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నిర్వహించే ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ను అధికారులు రిలీజ్ చేశారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల 7 వరకూ ఉంటుందని ప్రకటించారు. ఈనెల 30న ఆన్​లైన్ రిజిస్ర్టేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుందని, అక్టోబర్ 1న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. అక్టోబర్ 1,2 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, 4వ తేదీన సీట్ల అలాట్మెంట్ ఉంటుందని చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు 5వ తేదీలో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, 7వ తేదీలోగా కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించారు.


Similar News