Holidays In 2025: వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ వచ్చేసిందోచ్.. ఆ నెలలోనే ఎక్కువ హాలిడేస్

ప్రస్తుతం సెప్టెంబర్ నెల కావొస్తుంది. మరో 3 నెలల్లో న్యూ ఇయర్ స్టార్ట్ కానుంది.

Update: 2024-09-25 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సెప్టెంబర్ నెల కావొస్తుంది. మరో 3 నెలల్లో న్యూ ఇయర్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది 2025 కు గాను సాధారణ సెలవులను ప్రకటించేసింది. ఈ మేరకు ప్రభుత్వం హాలీడేస్‌ కేలండర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 17 కంపల్సరీ సెలవులుండగా, 2 ఆప్షనల్‌ హాలీడేస్‌ను ఎంచుకోవచ్చు. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయి. అయితే ఈ లిస్ట్‌ ప్రకారం.. వచ్చే ఏడాది 2025 లో ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2025 సంవత్సరానికి గాను మొత్తం పబ్లిక్‌ హాలీడేస్‌ లిస్ట్‌ ఇదే..

గణతంత్ర దినోత్సవం - జనవరి 26

మహాశివరాత్రి - ఫిబ్రవరి 26

హోళీ - మార్చి 14

ఈద్‌-ఉల్-ఫితర్ - మార్చి 31

మహావీర్ జయంతి - ఏప్రిల్ 10

గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 18

బుధ పూర్ణిమ - మే 12

బక్రీద్ - జూన్ 7

మొహర్రం - జూలై 6

స్వాతంత్య్ర దినోత్సవం - ఆగస్టు 15

జన్మాష్టమి - ఆగస్టు 16

మిలాద్-ఉన్-నబీ - సెప్టెంబర్ 5

మహాత్మా గాంధీ జయంతి - అక్టోబర్ 2

దసరా - అక్టోబర్ 2

దీపావళి - అక్టోబర్ 20

గురు నానక్ జయంతి - నవంబర్ 5

క్రిస్మస్ డిసెంబర్ - 25

2025 సంవత్సరానికి గాను ఆప్షనల్‌ హాలీడేస్‌ లిస్ట్‌ ఇదే..

న్యూఇయర్‌ - జనవరి 1

గురు గోవింద్ సింగ్ జయంతి - జనవరి 6

మకర సంక్రాంతి - జనవరి 14

బసంత్ పంచమి - ఫిబ్రవరి 2

గురు రవిదాస్ జయంతి - ఫిబ్రవరి 12

శివాజీ జయంతి - ఫిబ్రవరి 19

స్వామి దయానంద సరస్వతి జయంతి - ఫిబ్రవరి 23

హోలికా దహన్ - మార్చి 13

డోలి యాత్ర - మార్చి 14

శ్రీ రామనవమి - ఏప్రిల్ 16

వినాయక చతుర్థి - ఆగస్టు 27

ఓనం లేదా తిరువోనం - సెప్టెంబర్ 5

దసరా (సప్తమి) సె- ప్టెంబర్ 29

దసరా (మహాష్టమి) - సెప్టెంబర్ 30

దసరా (మహానవమి) - అక్టోబర్ 1

మహర్షి వాల్మీకి జయంతి - అక్టోబర్ 7

కరక చతుర్థి (కర్వా చౌత్) - అక్టోబర్ 10

నరక చతుర్దశి - అక్టోబర్ 20

గోవర్ధన్ పూజ - అక్టోబర్ 22

భాయ్ దూజ్ - అక్టోబర్ 23

ప్రతిహార షష్ఠి లేదా సూర్య షష్ఠి - అక్టోబర్ 28

గురు టేగ్ బహదూర్ షహీద్ దినం - నవంబర్ 24

క్రిస్మస్ - డిసెంబర్ 24

పబ్లిక్‌ హాలీడేస్‌/ కంపల్సరీ హాలీడేస్‌కి అదనంగా, ప్రతి ఉద్యోగి.. ఏవైనా రెండు ఆప్షనల్‌ హాలీడేస్‌ను ఎంచుకోవచ్చు.


Similar News