నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కోల్కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దిశ,వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కోల్కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్(CIL)లో 640 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&T, సిస్టమ్ విభాగాల్లో 60శాతం మార్కులతో బీటెక్ పాసైన వారు అర్హులు. వయసు 30-09-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. గేట్-2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం రూ.50,000-1,60,000 ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.coalindia.in సందర్శించండి.
పోస్టు పేరు, ఖాళీలు: మైనింగ్-263, మెకానికల్-104, ఎలక్ట్రికల్-102, సివిల్-91, సిస్టమ్-41, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్-39