రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు తోడు ప్రస్తుతం విపణిలో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిన రేట్లతో సామాన్యునికి పూట గడవడం కష్టంగా మారింది. ప్రపంచంలోనే బియ్యం అధికంగా పండించే దేశాల్లో ఒకటైన భారతదేశంలోనే ఇంతలా బియ్యం రేట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
సంవత్సర కాలంలోనే బియ్యం ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఆ రకం ఈ రకం అని తేడా లేకుండా అన్ని రకాల బియ్యం రెట్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజల రోజూవారీ ప్రధాన ఆహారం అన్నం. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి.ఇప్పటికే అన్ని నిత్యావసర ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు సామాన్యులు. ఇది సరిపోదన్నట్లుగా కొద్దిరోజులుగా బియ్యం ధరలూ పెరిగిపోతున్నాయి. సంవత్సరపు కాలంలోనే బియ్యం ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఆ రకం ఈ రకం అని తేడా లేకుండా అన్ని రకాల బియ్యం రేట్లు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే భారత దేశం చైనా దేశం తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తి దారు అయినప్పటికీ బియ్యం రెట్లు పెరిగిపోతున్నాయి. గత రెండు నెలరోజుల్లోనే అన్ని రకాల బియ్యం రకాల రెట్లు 7 శాతానికి పైగా పెరిగాయి. సగటున 40 రూపాయల నుండి 60 రూపాయలకి పెరిగింది. కొన్ని రోజులుగా క్వింటాల్‌కి నెల నెలా 200 నుంచి 300 వరకు పెరిగినాయి. సగటున బియ్యం ధర క్వింటాల్‌కి 6500 రూపాయల మేరకు ఉంది. కొన్ని రోజుల్లోనే బియ్యం రేట్లు సుమారు 14% మేర పెరిగాయి.
ధరలు పెరగడానికి కారణం..
దేశంలోని ఏ వస్తువు ధర అయిన నిరంతరం నిలకడగా ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తువుల ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అది ఆర్థిక వ్యవస్థలో భాగమే, కానీ ఏదైనా ఒక వస్తువు ధర ఉన్నపళంగా పెరగడం, కొద్ది రోజుల్లోనే ధరలు గరిష్ట స్థానానికి చేరుకోవడం అనేది ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుంది. దీనివల్ల జనాల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో బియ్యం విషయంలో డిమాండ్‌కి సప్లయ్‌కి మధ్య ఉన్న తేడా వల్ల బియ్యం రేట్లు పెరుగుతున్నాయి. దేశంలో బియ్యం అధికంగా పండించే కృష్ణా బేసిన్ ప్రాంతంలో ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల బియ్యం ఉత్పత్తి తగ్గినట్లు కేంద్ర వాతావరణ శాఖ వారి నివేదికలు తెలుపుతున్నాయి. భారత్ ప్రభుత్వం సన్న బియ్యం, బస్మతీయేతర బియ్యం, నూకల ఎగుమతుల నిషేధం విధించింది. దీంతో ప్రపంచ విపణిలో బియ్యం ఎగుమతి, దిగుమతుల తీవ్ర అంతరాయం కలిగి బియ్యం రెట్లు పెరిగిపోతున్నాయి.
దొడ్డు బియ్యం తింటలే!
రాష్ట్రంలో దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కింద ఉచితంగా అందించే బియ్యాన్ని రాష్ట్రంలోని 70 శాతం వరకు తినడం లేదు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి సన్న బియ్యాన్ని కొంటున్నారు. రాష్ట్రం లోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల నుంచి భారీగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకి గురవుతుంది. ఇది చట్ట వ్యతిరేకం. దీన్ని స్మగ్లింగ్‌గా కూడా పరిగణిస్తారు. ఇది ఒక పెద్ద మాఫియాగా మారింది. ప్రజలు పిడిఎస్ బియ్యాన్ని కిలోకి 12 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. ఇందువల్ల ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే లక్ష్యం దెబ్బతింటుంది.
ధరల నియంత్రణ ఎలా?
ప్రస్తుతం ' భారత్ రైస్' పేరిట నాణ్యమైన బియ్యాన్ని 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. వాటిని నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో విక్రయిస్తుంది. అలాగే ఇ- కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకురానున్నారు. 5 కిలోల, 10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఇదే విధంగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారత్ అట్టా,భారత్ దాల్ పేరిట గోధుమ పిండి కిలో 27 రూపాయలకి, శనగ పప్పు 60కి కిలో అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. బియ్యం ధరల పెరుగుదలపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. బియ్యం ఎగుమతులపై ఉన్న నియంత్రణలను కొంచెం సడలించినప్పటికీ, నిబంధనలు మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉంది.
నేరడిగొండ సచిన్
8790747628