వణికిస్తున్న వైరల్ ఫీవర్లు
రాష్ట్రంలో విషజ్వరాలు విస్తృత మవుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో రద్దీగా ఉంటు న్నాయి. డెంగ్యూ, వైరల్, మలేరి యా, జ్వరాలతో జనం బాధపడుతున్నారు.
రాష్ట్రంలో విషజ్వరాలు విస్తృత మవుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో రద్దీగా ఉంటు న్నాయి. డెంగ్యూ, వైరల్, మలేరి యా, జ్వరాలతో జనం బాధపడుతున్నారు. ఏజెన్సీ ఏరియాలలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొత్త గూడెంలో 18 నెలల చిన్నారి మలేరియాతో చనిపోయింది. కొమరం భీమ్, అసిఫాబాద్ జిల్లాలో సంక్షేమ బాలికల వసతి గృహంలో టెన్త్ క్లాస్ అమ్మాయి ప్రాణాలు విడిచింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నెలల బాలుడు డెంగ్యూతో చనిపోయాడు. ఇలా ఎన్నో ఘటనలు, విషాదాలు...
మరణాల లెక్కలు చూపరు..
జ్వరాలతో ప్రాణాలు పోతున్న వారిని పక్కన పెడితే.. దవాఖానాల చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో.. హైదరాబాద్ సిటీతో సహా అన్ని జిల్లాల్లో వైరల్ జ్వరాలు డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ కేసులు భారీగా వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతా ల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 3000 డెంగీ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అయితే డెంగీ, మలేరియా మరణాలు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లో సరిగా చూపడం లేదని వాదనలు వస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే కేసులు లెక్కల్లోకి రావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని కేసులు కలిపితే ఇంకా రెట్టింపు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 36 మంది విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది.
మలేరియా బారిన వేల గ్రామాలు
సీజనల్ వ్యాధులతో సర్కార్ దావాఖానాలు నిండిపోతున్నాయి. ఇంకొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. స్తోమత లేని వారు మాత్రం ఇంటి దగ్గరనే చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. రాష్ట్రంలో మలేరియా పీడిత గ్రామాలను ప్రభుత్వం గుర్తిం చింది. అందులో 1000 గ్రామాలు ఖమ్మంలోనే ఉన్నా యి. కానీ ముందస్తు చర్యలు మాత్రం లేవు. నమోదవుతున్న కేసులు బట్టి ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం విఫలం అయిందని స్పష్టం అవుతోంది. గ్రామాలలో నిధులు లేక పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. దోమల పొగ, స్ప్రేయింగ్ ఎప్పటికప్పుడు చేసేవారు కానీ దాన్ని విస్మరించారు. కొన్ని పీహెచ్‌సీలల్లో మందులు దొరకడం లేదని జనం మండిపడుతున్నారు. సీజనల్ రోగాల నివారణకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య శాఖ ముందస్తు కార్యాచరణ చేపట్టకపోవడం, మందులు అందుబాటులో ఉంచుకోకపోవడంతో వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అప్రమత్తమై వేగవంతమైన చర్యలు చేపట్టి సీజనల్ వ్యాధుల బారి నుంచి రాష్ట్ర జనాన్ని కాపాడాలి.
పట్ట హరిప్రసాద్
87908 43009