ఫుడ్ పాయిజన్‌కు మూల కారణాలు..
రాష్ట్రంలోని హస్టళ్లలో, వసతి గృహాల్లో సమస్యలపై సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ ఘటనలు రిపీట్ అవుతున్నాయి.
రాష్ట్రంలోని హస్టళ్లలో, వసతి గృహాల్లో సమస్యలపై సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ ఘటనలు రిపీట్ అవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు బలైపోతున్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు మధ్యాహ్న భోజనం వికటించింది. ఇది నారాయణపేట జిల్లా ఒకటే కాదు.. ఇటీవల రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలలో కూడా ఇలాంటి ఘటనలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
మాగనూరు స్కూల్‌కు సంబంధించి మొదటి ఘటన అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే సంభవించిందని నిర్ధారణంగా తెలుస్తోంది. అయితే, పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన బియ్యాన్ని జల్లెడ పట్టకుండా నేరుగా వండితే పురుగులు రాకుండా ఇంకేం వస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు నిపుణులు..
నేరుగా రంగంలోకి దిగి..
ఇక గురుకులాల విషయానికి వస్తే, గత ప్రభుత్వ విధానపరమైన లోపాలు, నిర్ణయాలతో ప్రారంభించిన వీటిలో ఎక్కువగా నేటికీ అద్దె భవనాల్లో కొనసాగుతుండటం గమనార్హం. వీటిలో వంటశాలలు, ప్రత్యే కంగా స్టోర్ రూంలు అంటూ ఏమీ లేవు. దీంతో ఫుడ్ సామాగ్రి పాడైపోతున్నాయంటున్నారు అక్కడి సిబ్బంది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇటు వంటలను, ఆటు బోధనను చూసుకోవాల్సిన పరిస్థితి. పూర్తి శ్రద్ధను పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. దీంతో విద్యా ప్రమాణాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని తేలిం ది. విద్యాశాఖ సీఎం దగ్గరనే ఉంది కాబట్టి సీఎం నేరుగా రంగంలోకి దిగి, సమస్యలకు గల మూల కారణాలను వెతికి, పరిష్కారానికి చొరవ చూపాలి. గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలందరూ పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారు కాబట్టి, వారికి మధ్యాహ్నం నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
రిపీట్ కాకుడదంటే..
నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదా న్ని నిజం చేయడానికి చదువులు, ఆట, పాటల్లో రాణించడానికి పౌష్టికాహారం ఎంతో అవసరం. అది లేకే వందలాది మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని సర్కార్ తెలుసుకోవాలి. ప్రభుత్వ బడులపై పర్యవేక్షణ ఉండే లా చేయాలి. అందుకోసం విద్యా రంగా నికి నిధులు, సొంత భవనాలు నిర్మిం చాలి. సరిపడా సిబ్బందిని నియమించాలి. ఆ దిశగా సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించాలి. అప్పుడే విద్యార్థులు ఈ సమస్య నుంచి బయటపడతారు. లేదంటే మాగ నూరు లాంటి ఘటనలు రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
పట్ట హరినాథ్
87908 43009