దేశంలో కావాల్సిందేమిటి?

Poem

Update: 2024-09-29 18:45 GMT

లెక్కలేని నినాదాలు

వేరు వేరు విధానాలు

పేరు పేరున సంఘాలు!

ఉద్యమాలు

ఊపిరి పోసుకుంటాయి ఎన్నో

పురిట్లోనే అటుకెక్కుతాయి కొన్ని!

పుట్టుకొస్తాయి పుట్టగొడుగుల్లా పార్టీలు

కొత్త కొత్త ఎజెండాలతో

రంగురంగుల జెండాలతో!

కొన్ని నిలిచిపోతాయి

చాలా వరకు వెలిసిపోతాయి

అవసరాలకు కలిసి పోతాయి!

సిద్ధాంతాల పేరున రాద్ధాంతాలు

అధికారాలకై సర్దుబాట్లు

పదవులకై అగచాట్లు!

మనిషి మనిషికి ఓ ఇజం

పదవీ కాంక్షే నిజం!

కులాలని, మతాలని, ప్రాంతాలని

రెచ్చగొట్టే భావజాలం

నాయకుల మాయాజాలం!

ప్రజల్లో గందరగోళం!!

మరి కావాల్సినదేమిటి?

అందరిలో దేశభక్తి!

ప్రజల్లో సంఘటిత శక్తి!!

జగ్గయ్య.జి

9849525802

Tags:    

Similar News