సాధించిన దానితో సంతృప్తి చెంది ఇదే విజయం అని సర్దుకుపోయే తత్వం కాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్దలోని శాస్త్రవేత్తల తీరు. నిరంతరం మెదడును పదును పెట్టి మేధోమథనం మెదలుపెట్టి అంతరిక్ష రంగంలో సవాళ్ళను సాంకేతికంగా అధిగమిస్తూ ఆకాశమే హద్దుగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అకుంఠిత దీక్షతో ఖచ్చితత్వంతో నియమిత వ్యయంతో పరిమితులను అధిగమించి. పరిణితితో విజయాలకు మరో చిరునామాగా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న భారత్ మరో కీలక లక్ష్యం దిశగా సాగుతోంది.
అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో భారత్ సంచలనాత్మక పురోగతికి ఎక్స్ పోశాట్ ప్రయోగం నాంది కానుంది. కొత్త సంవత్సరం(2024) తొలి రోజే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్-రే మూలాలను అన్వేషించడమ ఎక్స్‌పోశాట్ లక్ష్యం. ఉపరితలానికి 650 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్‌ని ప్రవేశపెడతారు.
ఇస్రో చరిత్రలో ఈ పీఎస్ఎల్వీ -సీ 58 60 వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు ఎక్స్‌ఫో శాట్‌ని విజయ వంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 418 కిలోల బరువు ఉండే ఎక్స్‌ఫోశాట్, కేరళ యూనివర్శిటీ విద్యార్ధులు రూపొందించిన వీఐవై నానాశాట్‌లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు.. భూ ఉపరితలానికి 650 కి.మీ ఎత్తులోని వృత్తాకార కక్ష్య లోకి ఈ శాటిలైట్లను ప్రవేశ పెట్టారు. ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిన తర్వాత పీఎస్4 10 ఇతర పేలోడ్‌లను చేసింది. ఈ ప్రయోగం ద్వారా ఎక్స్‌ఫో శాట్‌ని నింగిలోకి పంపనున్నామని తెలిపారు.
ఎక్స్-రే మూలాల అన్వేషణ
ఖగోళంలోని బ్లాక్ హోల్స్, తోక చుక్కల నుంచి నక్షత్రాల నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి కిరణాల అధ్యయనం కోసం ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై దృష్టి సారించడం దీని ప్రధాన లక్ష్యం. గత మిషన్ల మాదిరిగా కాకుండా, ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసేందుకు... ఎక్స్-రే మూలాలను అన్వేషించడం కోసం ఈ ప్రయోగం రూపొందించబడినది. ఎక్స్ రే కిరణాలపై పరిశోధన కోసం రూపొందించిన ఎక్స్‌ఫో శాట్ ద్వారా అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్, పాలపుంతలచే ఆవిర్బావం, అక్కడి పరిస్థితులు తదితర ఆంశాలను లోతుగా విశ్లేషించటానికి నిర్దేశింపబడిన ఎక్స్‌ఫో శాట్. ఐదేళ్ల పాటు ఎక్స్‌ఫో శాట్ సేవలు అందించనుంది.
ఇస్రో తన నమ్మినబంటు వాహక నౌక పీఎస్ఎల్వీ ద్వారా ఈ ప్రయోగం చేపట్టింది. ఇప్పటివరకు 59 పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు జరుగగా, సోమవారం జరిగిన ప్రయోగం పీఎస్ఎల్వీ సిరీస్‌లో 60వది.. ఎక్స్‌ఫో శాట్‌తోపాటు కేరళ యూనివర్శిటీ విద్యార్ధులు రూపొందించిన విఐవై (VIY) నానోశాట్‌ని కూడా కక్ష్యలో పెట్టింది. ఆత్మనిర్బరంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో స్వావలంబన సాధిస్తూ అనేక విజయాలను సాధిస్తోంది ఇస్రో ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా ఇస్రో మరిన్ని విజయాలు సొంతంచేసుకుని వాణిజ్య పరంగా కూడా ముందుకు సాగాలి. సాహో ఇస్రో,.
శ్రీధర్ వాడవల్లి
99898 55445