స్వరాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులవి ఎనలేని ప్రాణత్యాగాలు. ఓయూ కేంద్రంగా ఉద్యమ గళమెత్తిండ్రు, ఉద్యమ ఉధృతిలొ నెత్తురు సైతం దారపోసిండ్రు. సమైక్యాంధ్రలో తెలంగాణకు జరుగుతున్న విద్యా, ఉద్యోగ నియామకాలలో తీరని లోటుని గుర్తించి విద్యార్థిలోకం తెలంగాణ స్వరాష్ట్రమని పట్టుపట్టి నినదించింది. ముఖ్యంగా 2009 నుండి 2014వరకు విద్యార్థి గర్జన, విద్యార్థి రణబేరి, విద్యార్థి పొలికేకలతో ఊరూరున గడపగడపనా ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఘనత విద్యార్ధులదే. భవిష్యత్ తెలంగాణ విద్యార్థులదే అని కలలుకన్న విద్యార్థి ఉద్యమకారులకు స్వరాష్టంలో పాలకులు మొండిచెయ్యి చూపించారు. విద్యా సంస్థలను నిరుద్యోగ కర్మాగారాలుగా మారుస్తూ వృత్తి విద్యా నైపుణ్య శిక్షణల ఆధునికతను బలహీన వర్గాలకు అందకుండా చేసాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. స్వరాష్ట్ర తొలి ఫలితాలు అందుకోవాల్సిన విద్యావ్యవస్థ, రాష్ట్ర పునర్నిర్మాణం పేరిట పూర్తిగ నిర్వీర్యమైంది. ఇలా నిర్వీర్యమైన తెలంగాణ విద్యార్థుల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడమే ధ్యేయంగా తెలంగాణ స్టూడెంట్ పరిషత్ (టీఎస్‌పీ) బలమైన సంఘ నిర్మాణం అవుతూ, విద్యార్థులకు భరోసానిస్తుంది. ఇందులో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, యూనివర్సిటీల విద్యార్థుల చేత, విద్యార్థులే కేంద్రంగా ఏర్పాటు అవుతున్నది. నేడు ఉద్యమాల ఊపిరి ఉస్మానియా వేదికగా తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఆవిర్భావం కాబోతున్నది.
ఏర్పాటు తీర్మానాలు
బడ్జెట్లో విద్యారంగానికి 20శాతం కేటాయింపు, అన్ని గ్రామ పంచాయతిల్లో కార్పోరేట్ తరహా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్య, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. వృత్తి, విద్యా, నైపుణ్య శిక్షణలు మెరుగు పరచడం, ప్రతి మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల సంఖ్యను పెంచి, మహిళా గురుకులలో విద్యార్థినులకు పత్ర్యేక రక్షణ ఏర్పాటు చేయడం, పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు మానసిక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం, స్కాలర్షిప్‌ను పెంచడం, ఇప్పటికే ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయడం, ప్రభుత్వ యూనివర్సిటీలలో అధిక ఫీజులను నియంత్రించాలి వంటి తీర్మానాలతో ఈ విద్యార్థి సంఘం ఏర్పడుతుంది.
-బారి అశోక్ కుమార్
వ్యవస్థాపక అధ్యక్షులు
95810 72140