24 ఫ్రేమ్స్: స్వయంవరం సినిమాకి 50 ఏళ్ళు

24 ఫ్రేమ్స్: స్వయంవరం సినిమాకి 50 ఏళ్ళు... 24 frames: editorial on adoor gopalakrishnan swayamvaram movie

Update: 2022-11-25 19:00 GMT

తన నాలుగు దశాబ్దాల చలనచిత్ర జీవితంలో 12 సినిమాలు రూపొందించిన అదూర్ అనేక డాక్యుమెంటరీలు తీసారు. తన సినిమాలలో వివరాలన్నింటినీ తన సంతృప్తి మేరకే తీసుకునే అదూర్ నటులు స్వేచ్ఛ తీసుకోవడాన్ని అంగీకరించరు. వారు దర్శకుడి సంతృప్తి మేరకు నటించాలని అంటారు. నటీనటులకు పాత్రల వివరాలు, మాటలు సీన్లు సెట్లోకి వచ్చిన తర్వాతే ఇవ్వాలంటారు. ఆ తర్వాతే రిహార్సల్, షూట్ అంటారాయన. అందుకే దర్శకుడి దృక్కోణాన్ని తెరపైకి ఎక్కించి ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సంపాదించారు. 3 జూలై 1941 న జన్మించిన అదూర్ గోపాలకృష్ణన్ కుటుంబానికి కథాకళి నేపథ్యం ఉండడంతో చిన్ననాటి నుంచే నాటకాలు ఆయన జీవితంలో భాగమయ్యాయి. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ తర్వాత తమిళనాడులోని దిండిగల్‌లో కొంతకాలం ఉద్యోగం చేసారు. అనంతరం పుణే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లో శిక్షణ పొందారు. త్రివేండ్రంలో మిత్రులతో కలిసి 'చిత్రలేఖ' ఫిలిం సొసైటీని స్థాపించి, 1972 లో 'స్వయంవరం' తీసారు.

సాధారణ అట్టడుగు ప్రాంతీయ స్థాయి నుంచి ప్రపంచ మానవ జీవితాలను ఆవిష్కరించిన దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్. ఆయన రూపొందించిన మొదటి సినిమా 'స్వయంవరం'. ఆ సినిమాకు ఇప్పుడు 50 యేళ్లు. అంటే గోల్డెన్ జూబ్లీ, స్వర్ణోత్సవం. అర్థవంత సినిమా అభిమానులకు, రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక పండగే. 'స్వయంవరం' మలయాళీ చిత్రసీమకు కొత్త భాషను, కొత్త ఒరవడిని చూపించిన సినిమా. ఎలాంటి రాజీ లేకుండా సినిమాను సినిమాగా ఆవిష్కరించిన దృశ్యకావ్యంగా నిలిచింది. అప్పటిదాకా మలయాళీ సినిమాలలో ఉన్న మెలోడ్రామా, పాటలు, డాన్సులు, కామెడీ ట్రాకులూ లేకుండా దృశ్య ప్రధాన ఒరవడిలో కొత్త దారులు వేసింది. 'రే' లాంటివారు ఆరంభించిన సమాంతర సినిమాలకు కొనసాగింపును నిర్దేశించింది.

ఇద్దరు ప్రేమికులు పెద్దలు అంగీకరించకున్నా తమ అభీష్టం మేరకు పెళ్లాడి తమ కాళ్లపై తాము నిలబడాలని నగరానికి వస్తారు. కానీ, ఈ సమాజంలో మనగలగడం అంత సులభం కాదని, అందునా రచయితగా నిలబడడం చాలా కష్టమని క్రమంగా తెలుసుకుంటారు. ఆ గమనంలో ఆ జంట ఎదుర్కొన్న అనుభవాలూ, చూసిన జీవితాలూ ఈ సినిమా కాన్వాస్. అందులో అదూర్ తన దృష్టి కోణాన్ని గొప్పగా ఆవిష్కరించారు. టార్చ్ బేరర్‌గా నిలిచారు. ఈ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా ఫిలిం క్రిటిక్ మధు ఎరవంకర THE JOURNEY, Swayamvaram at Fifty అన్న డాక్యుమెంటరీ తీసారు. అలా ఇది కేరళలోనే కాదు, మొత్తం భారతీయ సినిమా రంగం నిర్వహించుకోవాల్సిన పండుగ.

విశ్వవ్యాప్త గౌరవం

భారతీయ నవ్య సినిమా ప్రపంచంలో సత్యజిత్ రే తర్వాత అంతగా ప్రపంచవ్యాప్త గౌరవాన్ని అందుకున్న దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్. సినిమా ఒక పరికరం కాదు, అది ఒక ఆలోచన, అభిప్రాయం, ఒక ఆవిష్కరణ అని విశ్వసించారు. సినిమా ద్వారా జనానికి సామాజిక వాస్తవిక అవగాహన కలుగుతుందని అదూర్ సినిమాలు నిరూపిస్తాయి. అదూర్ భావుకుడు. వాస్తవికతకు నిబద్ధుడు. ఎప్పటికప్పుడు తనని తాను తెలుసుకుంటూ, ఆవిష్కరించుకుంటూ దృశ్య మాధ్యమంలో ప్రకటిస్తూ వచ్చారు. అదూర్ చిత్రయాత్ర సమస్తం ఆయన విశ్వసించిన వాస్తవికత కోణంలో, తనదైన ప్రాంతీయ నేపథ్యంలోనే సాగుతుంది. అందుకే ఆయన కేవలం తన మాతృభాష మలయాళంలోనే సినిమాలు తీసారు. వేరే భాషలో నిర్మించే అవకాశాలు వచ్చినా స్వీకరించలేదు. తనకు తెలిసిన భాషలో చెప్పడమే సరైనదని విశ్వసించారు. 'మీ సినిమా ఎలా రూపొందుతుందని' అడిగితే, 'కలగా మొదలై, అక్షరంగా రూపుదిద్దుకొని, పాత్రలుగా మారి, సినిమా తయారవుతుందని' చెప్పుకున్నారు.

ప్రాంతీయ కోణంతో పాటు అదూర్ సినిమాలలో మానసిక వాస్తవికత కూడా ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆయన సినిమాలలో మహిళలది ప్రముఖ పాత్ర. అట్లని అవి స్త్రీవాద పాత్రలే కాదు, మొత్తంగా కుటుంబాలను, సమాజాన్ని నిభాయించుకునే పాత్రలు. కేరళ మాతృస్వామ్య లక్షణాలు ఆయన సినిమాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అదూర్ సాధారణంగా తన సినిమాలకు తానే కథలు సమకూర్చుకుంటారు. 'మథిలుకల్' (మొహమ్మద్ బషీర్), విధేయన్ (పాల్ జక్కరియా) కథల ఆధారంగా తీసారు. తను సినిమా నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత మరే ఆలోచన లేకుండా మొదటి ప్రింట్ వచ్చే వరకు దీక్షగా పని చేస్తారు.

Also read: అర్థవంత సినిమా కావాలంటే అది తప్పదా?

అనేక డాక్యుమెంటరీలు

తన నాలుగు దశాబ్దాల చలనచిత్ర జీవితంలో 12 సినిమాలు రూపొందించిన అదూర్ అనేక డాక్యుమెంటరీలు తీసారు. తన సినిమాలలో వివరాలన్నింటినీ తన సంతృప్తి మేరకే తీసుకునే అదూర్ నటులు స్వేచ్ఛ తీసుకోవడాన్ని అంగీకరించరు. వారు దర్శకుడి సంతృప్తి మేరకు నటించాలని అంటారు. నటీనటులకు పాత్రల వివరాలు, మాటలు సీన్లు సెట్లోకి వచ్చిన తర్వాతే ఇవ్వాలంటారు. ఆ తర్వాతే రిహార్సల్, షూట్ అంటారాయన. అందుకే దర్శకుడి దృక్కోణాన్ని తెరపైకి ఎక్కించి ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సంపాదించారు. 3 జూలై 1941 న జన్మించిన అదూర్ గోపాలకృష్ణన్ (adoor gopalakrishnan) కుటుంబానికి కథాకళి నేపథ్యం ఉండడంతో చిన్ననాటి నుంచే నాటకాలు ఆయన జీవితంలో భాగమయ్యాయి. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ తర్వాత తమిళనాడులోని దిండిగల్‌లో కొంతకాలం ఉద్యోగం చేసారు. అనంతరం పుణే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌(pune film institute) నుంచి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లో శిక్షణ పొందారు. త్రివేండ్రంలో మిత్రులతో కలిసి 'చిత్రలేఖ' ఫిలిం సొసైటీని స్థాపించి, 1972 లో 'స్వయంవరం'(swayamvaram movie) తీసారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకుంది. తర్వాత అదూర్ తీసిన సినిమా 'కోడియాట్టం' ఒక అమాయకుడు సంపూర్ణ వ్యక్తిత్వం కల మనిషిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ప్రధాన పాత్రధారి గోపికి గొప్ప పేరును తెచ్చి పెట్టడంతో పాటు అనేక అవార్డులు సాధించింది. తర్వాత తీసిన 'ఎలిపత్తాయం' గొప్ప సినిమాగా ఎంచబడింది. ఒక కమ్యూనిస్టు కార్యకర్త జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా 'ముఖాముఖం'. 'అనంతరం' అదూర్ స్వీయ జీవిత కథాత్మక సినిమాగా చెప్పుకుంటారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో బషీర్ అనుభవించిన జైలు జీవితం ఆధారంగా 'మథిలుకల్' తీసారు. ఇందులో మమ్ముట్టి (malayalam hero mammootty) అద్భుతంగా నటించి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. తర్వాత విధేయన్, కథాపురుషన్ తీసారు. ఇవి రెండూ కేరళలో కొంత వివాదాస్పదమయ్యాయి. తర్వాత 'నాలు పెలుంగల్' తీసారు. ఇలా ఆయన నిర్మించిన సినిమాలు అంతర్జాతీయంగా ఎంతో పేరు గడించి సొంత గొంతును పలికించి నిలబెట్టాయి. మానవీయ విలువలు, కళాత్మక వాస్తవికత, మానసిక వాస్తవికతను తెర మీద నిజాయితీగా ఆవిష్కరించిన అదూర్ చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో ఆణిముత్యాలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Also read: సినిమా వినోదం అంపశయ్యపై చేరిందా?


వారాల ఆనంద్

94444 0501281

Tags:    

Similar News