అగ్రిగోల్డ్ స్కాం నిందితులను కస్టడీకి తీసుకున్న ఈడీ
దిశ, క్రైమ్ బ్యూరో: అగ్రిగోల్డ్ స్కాం కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఉన్న ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు సోమవారం కస్టడీకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించకుండా దాదాపు రూ.6,400 కోట్ల మనీ లాండరింగ్ స్కామ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాలలో అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.4109 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవల ఈడీ అటాచ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట […]
దిశ, క్రైమ్ బ్యూరో: అగ్రిగోల్డ్ స్కాం కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఉన్న ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు సోమవారం కస్టడీకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్‌దారులకు సొమ్ము చెల్లించకుండా దాదాపు రూ.6,400 కోట్ల మనీ లాండరింగ్ స్కామ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాలలో అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.4109 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవల ఈడీ అటాచ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు ఏవీ శేషు నారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌లను ఈడీ అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్ చేశారు. అనంతరం కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఈడీ అధికారుల వాదనలకు అంగీకరించిన కోర్టు ఈనెల 27 నుంచి జనవరి 5వరకు కస్టడీకి అనుమతించింది.