ఈసీబీ మంచి అవకాశం కోల్పోయింది : మార్క్ బుచర్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌ల కోసం మరిన్ని రోజులు కేటాయించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఇంగ్లాండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌ షెడ్యూల్‌ను మార్చమని ఈసీబీని కోరిన విషయం తెలిసిందే. అనధికారికంగా చేసిన ఈ అభ్యర్థనను ఈసీబీ తోసిపుచ్చింది. కాగా, ఈసీబీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్క్ బుచర్ తప్పుబట్టాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమకు అంది వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టు కున్నదని బుచర్ అభిప్రాయపడ్డాడు. ‘బీసీసీఐ అభ్యర్థనను అంగీకరించి ఉంటే భారత్‌కు చెందిన […]

Update: 2021-05-27 11:29 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌ల కోసం మరిన్ని రోజులు కేటాయించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఇంగ్లాండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌ షెడ్యూల్‌ను మార్చమని ఈసీబీని కోరిన విషయం తెలిసిందే. అనధికారికంగా చేసిన ఈ అభ్యర్థనను ఈసీబీ తోసిపుచ్చింది. కాగా, ఈసీబీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మార్క్ బుచర్ తప్పుబట్టాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమకు అంది వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టు కున్నదని బుచర్ అభిప్రాయపడ్డాడు. ‘బీసీసీఐ అభ్యర్థనను అంగీకరించి ఉంటే భారత్‌కు చెందిన టాప్ క్రికెటర్లను ‘ది హండ్రెడ్’లో ఆడించమని కోరే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈసీబీ మంచి అవకాశాన్ని కోల్పోయింది.’ అని బుచర్ అన్నాడు. ఈసీబీ అలాంటి నిర్ణయం తీసుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నాడు. ది హండ్రెడ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి క్రికెటర్లు ఆడితే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చేదని బుచర్ అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..