వారిపై కేసులు నమోదు చేశాం : శశాంక్ గోయల్

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నిక ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవలకు పాల్పడ్డారు. కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 1,08,082 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారని, 45.63 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తాజాగా.. హుజురాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఈ సందర్భంగా […]

Update: 2021-10-30 03:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నిక ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవలకు పాల్పడ్డారు. కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 1,08,082 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారని, 45.63 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తాజాగా.. హుజురాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటివరకూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలకు పాల్పడ్డ వారిపై కేసులు పెట్టాం. కొన్నిచోట్ల డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయని శశాంక్ గోయల్ అన్నారు.

Tags:    

Similar News