సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ వార్నింగ్

దిశ, జమ్మికుంట: టీఆర్ఎస్ శ్రేణులు తన భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. జమ్మికుంట మండలంలో పాదయాత్ర నిర్వహించిన ఆయన.. అనంతరం కేసీఆర్‌పై విమర్శలకు దిగారు. తమపై వచ్చిన అసత్య వార్తలను ప్రజలకు వివరించడానికి వచ్చిన జమునపై దాడికి యత్నించడం సరికాదన్నారు.  పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకోం, బీ కేర్ ఫుల్ అంటూ కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. పచ్చని సంసారంలో కేసీఆర్ చిచ్చు పెట్టారని, ఈ సంస్కృతి మంచిది కాదన్నారు. […]

Update: 2021-07-29 11:24 GMT

దిశ, జమ్మికుంట: టీఆర్ఎస్ శ్రేణులు తన భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. జమ్మికుంట మండలంలో పాదయాత్ర నిర్వహించిన ఆయన.. అనంతరం కేసీఆర్‌పై విమర్శలకు దిగారు. తమపై వచ్చిన అసత్య వార్తలను ప్రజలకు వివరించడానికి వచ్చిన జమునపై దాడికి యత్నించడం సరికాదన్నారు. పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకోం, బీ కేర్ ఫుల్ అంటూ కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. పచ్చని సంసారంలో కేసీఆర్ చిచ్చు పెట్టారని, ఈ సంస్కృతి మంచిది కాదన్నారు. చెరపకురా చెడేవు అనే సామెత మాదిరిగా తనను చెడిపే ప్రయత్నం చేశారని, చివరకు కేసీఆర్ చెడిపోయే పరిస్థితికి వచ్చారని ఈటల ఎద్దేవా చేశారు. ఈ బక్కొని మీద ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వందల మంది పోలీసులు పడ్డారని అసహనం వ్యక్తం చేశారు. దళిత బిడ్డలను ఏసీ బస్సుల్లో తీసుకెళ్లి భోజనాలు పెట్టారు సరే.. ఆ ప్రేమ నిజమేనా..? దళితుల ఓట్లు కొల్లగొట్టడానికా అంటూ ప్రశ్నించారు ఈటల.

Tags:    

Similar News