గుడ్ న్యూస్: అమరావతి నిర్మాణాలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

అమరావతి నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది..

Update: 2025-01-01 13:57 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని నిర్మాణాల(Capital Structures)పై ఏపీ ప్రభుత్వం(Ap Government) దూకుడు పెంచింది. పలు నిర్మాణాలకు టెండర్లు(Tenders) పిలిచింది. పలు జోన్లలో రోడ్లు(Roads), మౌలిక సదుపాయాల కోసం మొత్తం రూ. 2.300 కోట్లతో పనులకు టెండర్లను సీఆర్డీఏ(CRDA), అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్(ADC) ఆహ్వానించింది. సీర్డీఏ ద్వారా రూ. 1,470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ. 852 కోట్ల విలువైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. అటు నీరు కొండ రిజర్వాయర్ వరద నియంత్రణ పనులకు సైతం టెండర్లు ఆహ్వానించారు. జవనరి 22 వరకూ టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. సంక్రాంతి(Sankranti)లోపు సుమారు. రూ. 31 వేల కోట్లతో పలు నిర్మాణాలకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది.

Tags:    

Similar News