ఇంటి ఆవరణలో శ్వేత నాగు.. పూజలు ప్రారంభించిన ప్రజలు

తులసి చెట్టుపై శ్వేత నాగు దర్శనమిచ్చింది..

Update: 2025-01-04 06:44 GMT

దిశ, వెబ్ డెస్క్: తులసి మొక్కపై శ్వేత నాగు(Swetha Nagu) దర్శనమిచ్చింది. దీంతో ప్రజలు భారీగా తరలివచ్చి పూజల చేస్తున్నారు. తమ గ్రామానికి నాగదేవత(Naga Devatha) వచ్చిందంటూ దర్శించుకుంటున్నారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల(Bapatla District Chirala) మండలం ఈపురుపాలెంలో జరిగింది.


ఇవాళ ఉదయం ఈపూరుపాలెంలోని ఓ ఇంటి ఆవరణంలో తులసి మొక్కపై తెల్లటి వర్ణంతో ఉన్న పాము కనిపించింది. దీంతో ఇంటి సభ్యులు ఇది మహిమేనని అంటున్నారు. మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేతనాగు తమ ఇంట్లో ప్రత్యక్షం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ విషయం బయటకు తెలియడంతో చుట్టు ప్రాంత ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నాగదేవత తమ గ్రామంలో వెలిసిందని ప్రజలు దర్శించుకుంటున్నారు. పాలు, పూలు సమర్పించి పూజలు చేస్తున్నారు. 

Tags:    

Similar News