Big Alert:కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఆ ఎగ్జామ్స్ వాయిదా!

ఏపీలో పోలీసు కానిస్టేబుల్(Police Constable) అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-06 08:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో పోలీసు కానిస్టేబుల్(Police Constable) అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  ఆ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ రవి ప్రకాష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పోలీసులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు(PMT, PET) పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వీటిని జనవరి 11 నుంచి 20 తేదీ మధ్య నిర్వహించనున్నారు.

అయితే.. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీటిని వాయిదా వేసినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం.రవిప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈనెల 8న జరగాల్సిన దేహధారుడ్య పరీక్షలను 11వ తేదీకి మార్చినట్లు తెలిపారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈనెల 17, 18, 20వ తేదీల్లో హాజరుకావచ్చని అభ్యర్థులకు సూచించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 30న ప్రారంభమైన పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు(Physical endurance tests) ఫిబ్రవరి ఒకటి వరకు కొనసాగుతాయి.


Similar News