New Year లెక్క తేలింది.. డిసెంబర్ 31న సర్కార్‌కు ఎన్ని రూ.కోట్ల ఆదాయం వచ్చిందటే..
నూతన సంవత్సర వేడుకలలో మద్యం అమ్మకాలతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది.
దిశ, తెలంగాణ బ్యూరో : నూతన సంవత్సర వేడుకలలో మద్యం అమ్మకాలతో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. రెండు రోజుల్లో రూ.680కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 వతేదీన రూ.282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30వ తేదిన రూ.402కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 2620 వైన్స్ షాపులు, 1117 బార్ అండ్ రెస్టారెంట్ ,పబ్స్ ద్వారా ఎక్సైజ్ శాఖ కు ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు తెలుపుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో 40 టీములతో ఎక్సైజ్ దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలా సన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు జరిగిన దాడుల్లో నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. రెండు చోట్ల గంజాయి పట్టుకోవడంతో పాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. రెండు చోట్ల 313 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి తో పాటు 17 మంది అధికారుల నూతన సంవత్సర వేడుకలలోఅక్రమ మద్యం, డ్రగ్స్ ఆక్రమ రవాణా పై పర్యవేక్షించారు. నూతన సంవత్సర సంబరాల్లో విధులు నిర్వహించిన సిబ్బందిని వివి కమలా సన్ రెడ్డి అభినందించారు.
287 ఈవెంట్స్ ద్వారా రూ.56.46లక్షల ఆదాయం
నూతన సంవత్సర వేడుకలకు ఎక్సైజ్ శాఖ 287 ఈవెంట్స్ కు అనుమతులిచ్చారు. అనుమతుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 56.46లక్షల ఆదాయం సమకూరనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు ఇవ్వగా మిగిలిన జిల్లాల్లో 44 అనుమతులు ఇచ్చారు. ఈవెంట్ అనుమతుల్లో రూ. 2.50 లక్షలతో ఒక అనుమతి, రూ. లక్ష తో మూడు అనుమతులు, రూ. 50 వేలతో ఏడు అనుమతులు ఇచ్చారు. 2023 డిసెంబర్ 31న 224 అనుమతులకు మంజూరు చేయగా రూ.44.76 లక్షల ఆదాయం వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ లో న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?