ఈటల అక్కడ మూడు రోజులు మకాం..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులతో కలసి శామీర్‌పేట్ నుండి తన నియోజకవర్గమైన హుజురాబాద్‌కు బయలుదేరారు. ఈటల రాజేందర్ మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఆయన తన నియోజకవర్గంలోని కేడర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. హుజురాబాద్ శ్రేణులతో సమావేశమైన తరువాతే విధి విధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేసే అలోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం. అడుగడుగునా నిఘా… మంత్రివర్గం నుండి […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులతో కలసి శామీర్‌పేట్ నుండి తన నియోజకవర్గమైన హుజురాబాద్‌కు బయలుదేరారు. ఈటల రాజేందర్ మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఆయన తన నియోజకవర్గంలోని కేడర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. హుజురాబాద్ శ్రేణులతో సమావేశమైన తరువాతే విధి విధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేసే అలోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం.
అడుగడుగునా నిఘా…
మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. హైదరాబాద్ నుండి కూడా స్పెషల్ టీంలు హుజురాబాద్‌కు చేరుకున్నాయి. వీరితో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ప్రత్యేకంగా సమాచారాన్ని సేకరిస్తున్నాయి.