ఈటల నోట.. రాజీనామా మాట..!

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రులు అంతరాత్మ సాక్షిగా మాట్లాడాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నేను ఎప్పుడు కూడ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని గుర్తు చేశారు. తాను ఎవ్వరి గురించి కామెంట్ చేయనని. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఈ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ మాత్రమేనన్నారు. అంత గొప్ప వ్యక్తి అయిన కేసీఆర్ ఎవరి వల్లనో, ఎవరి రిపోర్టు […]

Update: 2021-05-04 06:18 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర మంత్రులు అంతరాత్మ సాక్షిగా మాట్లాడాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నేను ఎప్పుడు కూడ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని గుర్తు చేశారు. తాను ఎవ్వరి గురించి కామెంట్ చేయనని. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఈ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ మాత్రమేనన్నారు. అంత గొప్ప వ్యక్తి అయిన కేసీఆర్ ఎవరి వల్లనో, ఎవరి రిపోర్టు వల్లనో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు.

కేసీఆర్ తరువాత ఆయన కొడుకు సీఎం కావాలని స్వాగతించాను తప్ప తాను సీఎం కావాలని లేదన్నారు. ఎవరో నినాదాలు ఇచ్చారని వాళ్లను వీల్లే పంపించి ఇచారని ఈటల ఆరోపించారు. మంత్రులుగా కాకున్నా మనుషులగా అయినా గుర్తించే ప్రయత్నం చేస్తే బాగుండేదన్నారు. యుద్దంలో కమాండర్ ఇన్ చీఫ్ ఎంత ముఖ్యమో గ్రౌండ్ లెవల్లో పనిచేసే సోల్జర్ కూడా అంతే ముఖ్యమని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు, కార్యకర్తలు కూడా ఉంటారని అందరి సమన్వయం, అందరియోక్క త్యాగం ఉంటేనే ఫలితం వస్తుందని ఈటల రాజేందర్ అన్నారు.

నేనే రాజీనామా చేసేవాణ్ణి…

‘ఈటల నువ్వు చేసింది మంచిది కాదని పిలిచి చెప్తే తానే రాజీనామా చేసే వాన్ని కానీ భూ కుంభకోణం నెపం మోపి, 500 మంది పోలీసులను పెట్టి, వందల మంది రెవెన్యూ అధికారులను పెట్టి తనపై ఇంత కక్ష్య సాధించడం అవసరమా అని ప్రశ్నించారు. నా బ్యాంకుకు వెళ్లారు నా అకౌంట్లన్ని చెక్ చేసుకున్నారు, ఏం చూస్తారు చెప్పండి, ఒక వేళ తప్పంటూ జరిగితే ఏ శిక్షకైనా సిద్దమే’నని ఈటల మరోసారి స్పష్టం చేశారు. ఇంత చెప్పిన తరువాత కూడ తనను విమర్శిస్తున్న ఎవరి మాటలకు కూడా స్పందించనన్నారు.

అదరాబాదరా చేశారు..

ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, రిపోర్ట్ ఇచ్చిన అధికారులు నీచంగా ప్రవర్తించారని మరోసారి ఈటల ఆరోపించారు. డిక్టేషన్ చేస్తే రాసినట్టుగా ఉందన్నారు. తనకు ముందుగా నోటీసులు ఇచ్చి చుట్టు పక్కల రైతాంగానికి నోటీసులు ఇచ్చి హద్దులు కొలవాల్సి ఉన్నప్పటికీ దేశ చరిత్రలో బాధ్యతగల మంత్రి మీద అదరా బాదరాగా నివేదికలు ఇచ్చిన చరిత్ర ఇదేనన్నారు.

Tags:    

Similar News