చిత్తూరులో కంపించిన భూమి.. భయంతో జనం పరుగులు

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భూమి కంపించింది. సుమారు 6 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు చెప్తున్నారు. పుంగనూరు మండలంలోని ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లి గ్రామాల్లో భూమి లోపల నుంచి భారీ శబ్దాలతో 6 సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం నుంచి రెండుసార్లు భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. గత మూడు […]

Update: 2021-07-23 03:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భూమి కంపించింది. సుమారు 6 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు చెప్తున్నారు. పుంగనూరు మండలంలోని ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లి గ్రామాల్లో భూమి లోపల నుంచి భారీ శబ్దాలతో 6 సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం నుంచి రెండుసార్లు భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తాజాగా భూమి కంపించడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రజలు హడలిపోతున్నారు.

Tags:    

Similar News