ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ఘట్టం ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. మూడ్రోజుల పాటు నామినేషన్ల పర్వం కొనసాగగా పలుచోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలిదశలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 29న సర్పంచులకు 1,317 నామినేషన్లు, వార్డులకు 2,200 నామినేషన్లు దాఖలు కాగా, ఈనెల 30న సర్పంచులకు 7,460, వార్డులకు 23,318 నామినేషన్లు వచ్చాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ఘట్టం ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. మూడ్రోజుల పాటు నామినేషన్ల పర్వం కొనసాగగా పలుచోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలిదశలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 29న సర్పంచులకు 1,317 నామినేషన్లు, వార్డులకు 2,200 నామినేషన్లు దాఖలు కాగా, ఈనెల 30న సర్పంచులకు 7,460, వార్డులకు 23,318 నామినేషన్లు వచ్చాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు.
నామినేషన్లను ఫిబ్రవరి 1న అధికారులు పరిశీలించనుండగా.. 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. వచ్చేనెల 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30వరకు పోలింగ్ కొనసాగనుంది. అదేరోజు సాయంత్రం 4గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.