చెన్నూరు పీహెచ్‌సీలో తెల్లవారుజామున ప్రసూతి సేవలు

దిశ, కల్లూరు: చెన్నూరు పీహెచ్‌సీ వైద్యురాలు, సిబ్బంది తెల్లవారుజామున ఓ గర్భిణీకి ప్రసూతి సేవలందించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున ఓ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కల్లూరు మండలంలోని పెద్ద కోరుకొండి గ్రామానికి చెందిన ఆవుల మరియమ్మ పురిటి నొప్పులతో బాధ పడుతుంది. దీంతో ఆమెను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం తెలుసుకున్న డాక్టర్ లావణ్య […]

Update: 2021-12-14 22:48 GMT

దిశ, కల్లూరు: చెన్నూరు పీహెచ్‌సీ వైద్యురాలు, సిబ్బంది తెల్లవారుజామున ఓ గర్భిణీకి ప్రసూతి సేవలందించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున ఓ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కల్లూరు మండలంలోని పెద్ద కోరుకొండి గ్రామానికి చెందిన ఆవుల మరియమ్మ పురిటి నొప్పులతో బాధ పడుతుంది. దీంతో ఆమెను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం తెలుసుకున్న డాక్టర్ లావణ్య వైద్య సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుంది. ఆ తర్వాత మరియమ్మను పరీక్షించి.. ఆమెకు సాధారణ కాన్పు అయ్యేవిధంగా చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో మరియమ్మ సాధారణ కాన్పు ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు బరువు 3.5 కిలోలు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా వైద్య సేవలు అందించిన డాక్టర్ లావణ్య, అదేవిధంగా వైద్య సిబ్బంది సింధు, సౌజన్య, పల్లవి, చెంద్రలీల, సూపర్ వైజర్ శ్రీకర్, పీ హెచ్ ఎన్ అన్నమ్మ, ప్రసాద్ లను మరియమ్మ కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News