ఈ నెల 23 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
దిశ, వెబ్డెస్క్: ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్య విభాగం ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం. నాయక్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెబ్ ఆప్షన్ల నమోదు, […]
దిశ, వెబ్డెస్క్: ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్య విభాగం ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం. నాయక్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంసెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.
అక్టోబరు 23వ తేదీన ఆంగ్లో ఇండియన్, పీహెచ్వీ, పీహెచ్హెచ్, పీహెచ్ఓ కేటగిరీల్లో మొదటి నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక అదే రోజున ఎన్సీసీ కేటగిరీలో నుంచి 35,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉండనుంది. ఇక 24న సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలలో 1 నుంచి 45,000 వరకు, ఎన్సీసీ కేటగిరీలో 35,001 నుంచి 70,000 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 25న సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలలో 45,001 నుంచి 90,000 ర్యాంకు వరకు, ఎన్సీసీ కేటగిరీలో 70,001 నుంచి 1,05,000 వరకు కౌన్సెలింగ్ జరగనుంది. ఇక చివరి రోజు 26న సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలలో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్సీసీ కేటగిరీలో 1,05,001 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.