‘మాట తప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ’

దిశ, ఖ‌మ్మం: డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా సోమావారం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్టీ రోడ్డుపై ప్ల‌కార్డ్స్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న రైల్వే ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు రైల్వే ప్రైవేటీకరణను చేయబోను అని చెప్పి, ఇప్పుడు మాట తప్పి ప్రజలను మోసం చేశాడ‌ని […]

Update: 2020-07-13 08:05 GMT

దిశ, ఖ‌మ్మం: డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా సోమావారం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్టీ రోడ్డుపై ప్ల‌కార్డ్స్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న రైల్వే ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు రైల్వే ప్రైవేటీకరణను చేయబోను అని చెప్పి, ఇప్పుడు మాట తప్పి ప్రజలను మోసం చేశాడ‌ని అన్నారు. ఈ నెల 15వ తేదీన ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్‌ల ఎదుట జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News