దసరా ఉత్సవాలు.. కండిషన్స్ అప్లై!

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టెంపుల్ ఈవో సురేష్‌బాబు తెలిపారు. మూలా నక్షత్రం నాడు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఈసారి దసరా ఉత్సవాలకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బడ్జెట్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికే దర్శన సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ మేరకు దుర్గగుడిలో దసరా నవరాత్రులు ఆహ్వాన […]

Update: 2020-10-07 10:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టెంపుల్ ఈవో సురేష్‌బాబు తెలిపారు. మూలా నక్షత్రం నాడు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఈసారి దసరా ఉత్సవాలకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బడ్జెట్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు.

లడ్డూ ప్రసాదం మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికే దర్శన సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ మేరకు దుర్గగుడిలో దసరా నవరాత్రులు ఆహ్వాన పత్రికను దుర్గగుడి పాలకమండలి సభ్యులు, తదితరులు ఆవిష్కరించారు.

Tags:    

Similar News