'ఆఫ్‌లైన్ పరీక్షలను వాయిదా వేయండి'
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మేలో జరగాల్సిన అన్ని ఆఫ్‌లైన్ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోరింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే అన్ని విద్యాసంస్థల్లో ఆఫ్‌లైన్ పరీక్షలను వాయిదా వేయాలని సూచించింది. ఆన్‌లైన్ పరీక్షలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.