దుబ్బాకలో 84.44 పోలింగ్ శాతం నమోదు

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి కల్పించారు. అయితే, దుబ్బాకలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ శాతం నమోదును బట్టి అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో […]

Update: 2020-11-03 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి కల్పించారు. అయితే, దుబ్బాకలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ శాతం నమోదును బట్టి అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జరిగిన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

ముందుగా దుబ్బాకలో 55,208 ఓటర్లు ఉండగా 44,700 పోలింగ్ 81.0 శాతంగా ఉంది.మిరుదొడ్డి 31,762 మందికి గానూ 25,646 ఓటేయగా పోలింగ్ 80.0 శాతంగా నమోదైంది. తోగుటలో 26,751 మందికి గానూ 22,081 పోల్ 82.5 శాతం, దౌల్తాబాద్ 23,032 గానూ 19,460 పోల్ 84.5 శాతం, రాయపోల్ 20513 గానూ 16856 పోల్ 82.2 శాతం, చేగుంట 32,829 గానూ 26,020 పోల్ 79.3 శాతం, నార్సింగి 8,215 గానూ 6,765 పోల్ 82.3 శాతం, గజ్వేల్ 446 ఓటర్ల గానూ 353 ఫోల్79.1 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొత్తం మీద 1,98,756 ఓటర్లు ఉండగా 1,61,881 ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా దుబ్బాక ఉపఎన్నికలో 84.44 పోలింగ్ శాతం నమోదైంది.

Tags:    

Similar News