సరస్వతి నిలయంలో మందు బాబులు.. అడ్డుకునేవారెవరు..?

దిశ,బోథ్: చదువుల తల్లి సరస్వతి కొలువుండే నిలయం పాఠశాల. ఎంతోమంది విద్యార్థులు  ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పాఠశాలే తొలిమెట్టు. అలాంటి విద్యానిలయం లాక్ డౌన్ సమయంలో మందుబాబులకు అడ్డాగా మారింది. నిత్యం విద్యార్థులతో, పుస్తకాలతో కళకళలాడే క్లాస్ రూమ్ లు బార్ లను తలపిస్తున్నాయి. పాఠశాలను ఎక్కడపడితే అక్కడ బీర్ సీసాలు, సిగరెట్ పీకలతో అస్తవ్యస్తంగా తయారు చేసిన ఘటన బోథ్ గ్రామంలోని గర్ల్స్ హై స్కూల్ వెనుక ఉన్న ప్రాథమిక పాఠశాలలో వెలుగుచూసింది. లాక్ డౌన్ […]

Update: 2021-05-25 01:18 GMT

దిశ,బోథ్: చదువుల తల్లి సరస్వతి కొలువుండే నిలయం పాఠశాల. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పాఠశాలే తొలిమెట్టు. అలాంటి విద్యానిలయం లాక్ డౌన్ సమయంలో మందుబాబులకు అడ్డాగా మారింది. నిత్యం విద్యార్థులతో, పుస్తకాలతో కళకళలాడే క్లాస్ రూమ్ లు బార్ లను తలపిస్తున్నాయి. పాఠశాలను ఎక్కడపడితే అక్కడ బీర్ సీసాలు, సిగరెట్ పీకలతో అస్తవ్యస్తంగా తయారు చేసిన ఘటన బోథ్ గ్రామంలోని గర్ల్స్ హై స్కూల్ వెనుక ఉన్న ప్రాథమిక పాఠశాలలో వెలుగుచూసింది. లాక్ డౌన్ కారణంగా స్కూల్ ని మూసివేయండంతో కొంతమంది వ్యక్తులు ఆ స్కూల్ ని బార్ గా మార్చేశారు. రోజూ మద్యం సేవించి, సీసాలను అక్కడే వదిలేసి వెళ్తున్నారు. ఇది గమనించిన గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా నిలయంలో ఇలాంటి పాడుపనులు చేయడం ఏంటని..? పాఠశాల ఉపాధ్యాయుల అప్పుడప్పుడు వచ్చి పాఠశాలను పర్యవేక్షించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News