1814 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు
దిశ, క్రైమ్ బ్యూరో : న్యూ ఇయర్ సందర్బంగా డిసెంబర్ 31న హైదరాబాద్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 1814 మందిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50 బృందాలు పాల్గొని 496 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు బుక్ […]
దిశ, క్రైమ్ బ్యూరో : న్యూ ఇయర్ సందర్బంగా డిసెంబర్ 31న హైదరాబాద్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 1814 మందిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50 బృందాలు పాల్గొని 496 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు బుక్ చేశారు. ఓవర్ స్పీడ్‌తో వాహనాలను నడిపినందుకు 367 మందిపై, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న 238 మందిపై కేసులు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 24 ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలను చేపట్టి.. 387 మందిపై కేసులు నమోదు చేశారు. ఓవర్ స్పీడ్ తో వాహనాలను నడిపిన 247 మందిపై కేసులు బుక్ అయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మోటారు వాహనాల చట్టం ప్రకారం డిసెంబరు 31 రోజునే 6049 కేసులు నమోదు చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 931 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గచ్చిబౌలి, నార్సింగ్, మాదాపూర్, రాయదుర్గం, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో అత్యధిక కేసులు బుక్ అయ్యాయి. అయితే, వీరిందరిపై చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టుకు రిమాండ్ చేయనున్నారు. అయితే, న్యూఇయర్ పురస్కరించుకుని మూడు కమిషనరేట్ల ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకపోవడం పట్ల కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్ సంతోషం వ్యక్తం చేశారు.