తాగేందుకు డబ్బులివ్వలేదని.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి దారుణ హత్య

దిశ, చార్మినార్​: అర్థరాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ బాటసారిని దాడిచేసి హత్య చేసిన అనంతరం తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ సీఐ పి.శ్రీనివాస్​కథనం ప్రకారం.. లాల్​దర్వజా పత్తర్​కీ దర్గాకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్​ (33)మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని రోడ్ల పై బాటసారులను వేడుకునేవాడు. డబ్బులు నిరాకరించిన వారిని బెదిరించడంతో పాటు దాడికి పాల్పడుతూ డబ్బులు వసూలు […]

Update: 2021-10-04 10:15 GMT

దిశ, చార్మినార్​: అర్థరాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ బాటసారిని దాడిచేసి హత్య చేసిన అనంతరం తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ సీఐ పి.శ్రీనివాస్​కథనం ప్రకారం.. లాల్​దర్వజా పత్తర్​కీ దర్గాకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్​ (33)మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని రోడ్ల పై బాటసారులను వేడుకునేవాడు. డబ్బులు నిరాకరించిన వారిని బెదిరించడంతో పాటు దాడికి పాల్పడుతూ డబ్బులు వసూలు చేసేవాడు.

ఈ నేపధ్యంలోనే అక్టోబర్​1వ తేదీన అర్థరాత్రి 12గంటల సమయంలో తాగేందుకు డబ్బులు లేకపోవడంతో అటుగా వస్తున్న మొఘల్​పురాకు చెందిన ఆటో డ్రైవర్​ సయ్యద్​ జహంగీర్​(45)ను అడ్డుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అతను ససేమిరా అనడంతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పిడిగుద్దులు గుద్దుతూ చితక బాదుతుండగా అతనిని తప్పించుకున్న జహంగీర్ పక్కనే ఉన్న హాజి కూల్​డ్రింక్​ షాపులోకి వెళ్లి తలదాచుకున్నాడు. జహంగీర్‌ను వెంబడించి మరీ పట్టుకుని మరోసారి తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన జహంగీర్​అక్కడిక్కడే మృతిచెందాడు. మొదట అనుమానస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో జహంగీర్‌ది అనుమానస్పద మృతి కాదు.. హత్యగా పోలీసులు నిర్దారించారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఇర్ఫాన్‌ను శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News