ప్లాష్.. ప్లాష్.. సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి

దిశ వెబ్‌‌డెస్క్: సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ‘అభా’ విమానాశ్రయంపై సాయుధ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గత 24 గంటల్లో ఇది రెండోదాడి కావటం గమనార్హం. ఇప్పటి వరకు దాడి చేసింది ఎవరనే దానిపై స్పష్టత లేకున్నా.. యెమెన్ తిరుగుబాటుదారులు అయిన హౌతీలే ఈ దాడి చేశారని రియాద్ అనుమానిస్తోంది. సాయుధ డ్రోన్ వ్యవస్థలను చాలా కాలంగా ఇరాన్, యెమెన్ తిరుగుబాటుదారులకు అందిస్తోంది. 2015 […]

Update: 2021-08-31 05:41 GMT

దిశ వెబ్‌‌డెస్క్: సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ‘అభా’ విమానాశ్రయంపై సాయుధ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గత 24 గంటల్లో ఇది రెండోదాడి కావటం గమనార్హం. ఇప్పటి వరకు దాడి చేసింది ఎవరనే దానిపై స్పష్టత లేకున్నా.. యెమెన్ తిరుగుబాటుదారులు అయిన హౌతీలే ఈ దాడి చేశారని రియాద్ అనుమానిస్తోంది. సాయుధ డ్రోన్ వ్యవస్థలను చాలా కాలంగా ఇరాన్, యెమెన్ తిరుగుబాటుదారులకు అందిస్తోంది. 2015 లో మొదలైన సనా తిరుగుబాటు ఇప్పటి వరకు ముగింపుకు రాలేదు. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలు మరణించారు. మానవ చరిత్రలోనే అత్యంత విషాద పరిస్థితులు యెమెన్‌లో ఉన్నాయని ఐరాస ఇంతకు ముందే ప్రకటించింది.

Tags:    

Similar News