మెగా పార్క్‌ను సందర్శించిన డీఆర్‌డీఓ పీడీ
దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో డీఆర్‌డీఓ పీడీ మధుసూదనరావు పర్యటించారు. బుధవారం మైబునగర్‌ని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వనంలో పనిచేస్తున్న కూలీల మాస్టర్‌ను డీఆర్‌డీఓ పీడీ పరిశీలించారు. మొక్కల పెంపకానికి నీటి కొరత ఉన్నట్లు కూలీలు తెలపడంతో త్వరలోనే బోరు మంజూరు చేస్తామని, డ్రిప్పు గ్రామ పంచాయతీ సమకూరుస్తుందని, కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలని సూచించారు. […]
దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో డీఆర్‌డీఓ పీడీ మధుసూదనరావు పర్యటించారు. బుధవారం మైబునగర్‌ని బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వనంలో పనిచేస్తున్న కూలీల మాస్టర్‌ను డీఆర్‌డీఓ పీడీ పరిశీలించారు. మొక్కల పెంపకానికి నీటి కొరత ఉన్నట్లు కూలీలు తెలపడంతో త్వరలోనే బోరు మంజూరు చేస్తామని, డ్రిప్పు గ్రామ పంచాయతీ సమకూరుస్తుందని, కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం గుంపెన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రేవతి, ఏపీఓ ప్రమీల, ఈసీ ప్రసాదరావు, టీఏ లు నాగజ్యోతి, శ్రీను పాల్గొన్నారు.