జిల్లా జైలుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందజేత
దిశ, ఖమ్మం రూరల్: ది ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవతా విలువల సంస్థ(ఐఎహెచ్వీ) సహకారంతో ఖమ్మం నగరంలో గల జిల్లా జైలుకు రెండు ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్’ ను పర్యవేక్షణాధికారి ఏ. శ్రీధర్‌కు అందజేశారు. ది ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థపాకులు పండింట్ రవిశంకర్ 1997లో ఈ సంస్థను స్థాపించి ప్రభుత్వ హస్పిటల్స్‌లో సాంకేతిక పరికరాలను, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి బండి చైతన్య తెలిపారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందజేసిన […]
దిశ, ఖమ్మం రూరల్: ది ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవతా విలువల సంస్థ(ఐఎహెచ్వీ) సహకారంతో ఖమ్మం నగరంలో గల జిల్లా జైలుకు రెండు ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్’ ను పర్యవేక్షణాధికారి ఏ. శ్రీధర్‌కు అందజేశారు. ది ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థపాకులు పండింట్ రవిశంకర్ 1997లో ఈ సంస్థను స్థాపించి ప్రభుత్వ హస్పిటల్స్‌లో సాంకేతిక పరికరాలను, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి బండి చైతన్య తెలిపారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందజేసిన సంస్థకు ప్రతినిధులకు జైలు అధికారులు విజయ్, సక్రునాయక్, డిప్యూటీ జైలర్ పీ. కృష్ణకాంత్‌లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ నిర్వహకులు ఎస్కే రహీం, రవి, శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.