అనుమతులు వచ్చిన వెంటనే బిల్డింగ్ నిర్మాణం
సేవ్ భద్రాద్రి కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం సేకరించిన నిధులు బ్యాంక్ ఖాతాలో భద్రంగా ఉన్నాయని, ఎండోమెంట్ అధికారుల అనుమతులు వచ్చిన తర్వాత మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభిస్తామని సేవ్ భద్రాద్రి కమిటీ పేర్కొంది.
దిశ, భద్రాచలం : సేవ్ భద్రాద్రి కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం సేకరించిన నిధులు బ్యాంక్ ఖాతాలో భద్రంగా ఉన్నాయని, ఎండోమెంట్ అధికారుల అనుమతులు వచ్చిన తర్వాత మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభిస్తామని సేవ్ భద్రాద్రి కమిటీ పేర్కొంది. పార్కు సమీపంలోని అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం స్థలంలో బిల్డింగ్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని, భవన నిర్మాణం విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తం అయినందున అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
అందుకే భవన నిర్మాణం ఆలస్యం అయిందని తెలిపారు. దాతల నుంచి సేకరించిన ప్రతి పైసా భద్రంగా ఉందని, సొంత అవసరాల కోసం నిధులను వాడుకోలేదని సేవ్ భద్రాద్రి కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం సమావేశమైన సేవ్ భద్రాద్రి సభ్యులు అందరి సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్లి బృహత్తర కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.