టీడీపీకి డొక్కా రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి కొద్ది కాలం క్రితం రాజీనామా చేసి టీడీపీలో కలకలం రేపిన ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తాజాగా పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చారు. కాసేపటి క్రితం బహిరంగ లేఖ ద్వారా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించిన డొక్కా.. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. బహిరంగ లేఖలోనే తాను వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపానని ప్రకటించి తన భవిష్యత్ ప్రణాళికపై క్లూ ఇచ్చిన సంగతి […]
ఎమ్మెల్సీ పదవికి కొద్ది కాలం క్రితం రాజీనామా చేసి టీడీపీలో కలకలం రేపిన ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తాజాగా పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చారు. కాసేపటి క్రితం బహిరంగ లేఖ ద్వారా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించిన డొక్కా.. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. బహిరంగ లేఖలోనే తాను వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపానని ప్రకటించి తన భవిష్యత్ ప్రణాళికపై క్లూ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీని వీడిన నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీలో చేరడం లాంఛనమే.
tags:dokka manikya varaprasad, resignation, tdp, ysrcp,