జోరు వానలో… వాగులు దాటుకుంటూ వెళ్లి వైద్య సేవలు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా గతకొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా విపరీతంగా వరదలు పారుతూ, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో జోరు వానతో పాటు… మరోవైపు కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరి ఆ వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మండలంలోని బట్టిగూడెం గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న సమాచారం అందుకున్న సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య […]

Update: 2020-08-20 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా గతకొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా విపరీతంగా వరదలు పారుతూ, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో జోరు వానతో పాటు… మరోవైపు కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరి ఆ వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

మండలంలోని బట్టిగూడెం గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న సమాచారం అందుకున్న సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మౌనిక తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి బయల్దేరారు. జోరును కురిస్తున్న వర్షంలో వాగులు దాటుకుంటూ బట్టిగూడెం గ్రామం చేరుకుని అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 35 మందికి డాక్టర్ మౌనిక పరీక్షలు చేశారు.

Tags:    

Similar News