ట్రూ లవ్ స్టోరీ : కాళ్లు, చేతులు కోల్పోయినా ప్రేమికుడితో ఆమె జర్నీ

దిశ,వెబ్‌డెస్క్: నిజమైన ప్రేమంటే వెంటపడి ప్రేమించటం ఒక్కటే కాదు, మనం ప్రేమించిన వాళ్లకి మన వల్ల చెడు జరుగుతుందంటే వదిలేయటం కూడా’ ఈ యువకుడు అలాగే చేశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ‘ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అమ్మ కూడా అంతగా ప్రేమించదేమో అనేలా ప్రేమిస్తుంది’. పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన సనా ముస్తాక్ కు దావూద్ ను చూడగానే గుండెలో ప్రేమ గంటలు మోగాయి. దావూద్ కూడా సనాపై తన ప్రేమను వ్యక్తం […]

Update: 2021-03-26 03:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: నిజమైన ప్రేమంటే వెంటపడి ప్రేమించటం ఒక్కటే కాదు, మనం ప్రేమించిన వాళ్లకి మన వల్ల చెడు జరుగుతుందంటే వదిలేయటం కూడా’ ఈ యువకుడు అలాగే చేశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ‘ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అమ్మ కూడా అంతగా ప్రేమించదేమో అనేలా ప్రేమిస్తుంది’.

పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన సనా ముస్తాక్ కు దావూద్ ను చూడగానే గుండెలో ప్రేమ గంటలు మోగాయి. దావూద్ కూడా సనాపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ ప్రేమలో హద్దులు చెరిపేస్తూ విహరించారు. అంతా బాగుంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అదే జరిగితే జీవితం ఎందుకవుతుంది.

ఇంట్లో పనిచేస్తుండగా హై పవర్ కరెంట్ తీగలు దావూద్ ను తాకాయి. ఈ ప్రమాదంలో దావూద్ ప్రాణాలైతే దక్కాయి కానీ రెండు చేతులు, ఒక కాలు కోల్పోయాడు. దీంతో సనా కుటుంబ సభ్యులు వాళ్ల పెళ్లిని వ్యతిరేకించారు. దావుద్ కు కాలు, చేతులులేవు నువ్వు ఏం చేయగలవని ప్రశ్నించారు. కానీ సనా మాత్రం దావూద్ ను వదిలేందుకు ఇష్టపడలేదు. ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఒప్పించేందుకు ప్రయత్నించింది. కానీ వాళ్లు ఒప్పుకోకపోయే సరికి ఇల్లు వదిలి తన మేనత్త ఇంటికి వెళ్లింది. అలా మేనత్త ఇంట్లో నెలరోజులున్న సనా ఆ తర్వాత దావూద్ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిస్థితులు ఎలా ఉన్నా దావూద్ ఉండేలా నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నా. నేను ఇతరుల గురించి ఆలోచించను కేవలం దావూద్ గురించే ఆలోచిస్తా. నేనిక్కడే ఉంటాను అని చెప్పా దేవుడు మీ చేతులు తీసుకున్నాడు. అందుకే నన్ను మీకిచ్చాడు. నేను మీతోనే ఉంటాను అని దావూద్ కు చెప్పినట్లు సనా తెలిపింది.

చేతులు తొలగించాక నన్ను నేను చూసుకుంటున్నప్పుడు.. ఆమె నాకోసం వస్తుందని నేను అసలు ఊహించలేదు. 8 గంటల ఆపరేషన్ తర్వాత కోలుకోలేకపోతే తనే నా చెవిలో ప్రార్ధన చేసింది. మీరు ఏమీ బాధపడకండి, నేను మిమ్మల్ని వదిలి వెళ్లను ఎప్పటికీ మీతోనే ఉంటాను అని చెప్పింది. కానీ నాకు చేతులు లేవు, కాలు లేదు. నేను తనని పెళ్లి చేసుకుంటే ఆమె జీవితాన్ని నాశనం చేసిన వాడినవుతాను అందుకే నిర్ణయాన్ని ఆమెకే వదిలేశా. ఆమె నాకోసం పుట్టి ఉంటే.. తనకు తానుగానే నాతో ఉంటుందని అనుకున్నా అలాగే జరిగింది. నన్ను పెళ్లి చేసుకొని కొడుకులా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ‘ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అమ్మ కూడా అంతగా ప్రేమించదేమో అనేలా ప్రేమిస్తుందంటే ఇదేనేమో అంటూ చెమ్మగిల్లుతున్న కన్నీటితో చెప్పాడు దావూద్.

Tags:    

Similar News