పద్దెనిమిది కిలోల కణితి తొలగింపు

దిశ, జనగామ: ఓ మహిళ గర్బం నుంచి పద్దెనిమిది కిలోల కణితిని జనగామ వైద్యులు తొలగించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామానికి చెందిన తూర్పాటి పెంటమ్మ గత 25 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. జనగామలోని కోటి రత్నా దవఖానలోని వైద్యులకు చూపించుకొగా వైద్యులు పెంటమ్మ గర్భంలో 18కిలోల కణితి గుర్చించారు. ఈ క్రమంలో పెంటమ్మకు తక్షణమే ఆపరేషన్ చేయాలని లేని పక్షంలో ప్రమాదం సంభవిస్తుందని వైద్యులు డాక్టర్ సుగుణాకర్రాజు ఆధ్వర్యంలో ఆపరేషన్ చేపట్టి […]

Update: 2021-01-27 10:08 GMT

దిశ, జనగామ: ఓ మహిళ గర్బం నుంచి పద్దెనిమిది కిలోల కణితిని జనగామ వైద్యులు తొలగించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామానికి చెందిన తూర్పాటి పెంటమ్మ గత 25 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. జనగామలోని కోటి రత్నా దవఖానలోని వైద్యులకు చూపించుకొగా వైద్యులు పెంటమ్మ గర్భంలో 18కిలోల కణితి గుర్చించారు.

ఈ క్రమంలో పెంటమ్మకు తక్షణమే ఆపరేషన్ చేయాలని లేని పక్షంలో ప్రమాదం సంభవిస్తుందని వైద్యులు డాక్టర్ సుగుణాకర్రాజు ఆధ్వర్యంలో ఆపరేషన్ చేపట్టి గర్భంలోని కణితి తొలగించి పెంటమ్మ ప్రాణాలు కాపాడినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈమేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు డాక్టర్ సుగుణాకరాజు బృందాన్ని అఖినందించారు.

Tags:    

Similar News